TTD : తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనంపై శ్రీవారి విహారం
TTD : తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనంపై శ్రీవారి విహారం |

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టులో రెండుసార్లు గరుడ వాహనసేవ జరుగనుంది. గరుడ పంచమి, శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా మలయప్పస్వామి గరుడవాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
ఈ నెల 13న గరుడ పంచమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి వారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారని ప్రాశస్త్యం.
ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది.
ఇవి కూడా చదవండి..
Extended Ban : భారత విమానాలపై మరోసారి నిషేధం పొడగించిన కెనడా
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్
Fire broke out : కర్మాన్ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

