హైదరాబాద్: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న గంగూభాయ్ కతియావాడీ ఫిల్మ్ ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అద్భుతమైన నటనతో వ్యభిచారి, లేడీ బాస్ పాత్రలో ఆలియా ఇరగదీసింది. హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీశారు. కామాటిపురాలో గంగూభాయ్ ఎలా మాఫియా క్వీన్‌గా ఎదిగిందో చూపించనున్నారు. అజయ్ దేవగన్, హుమా ఖురేషి, ఇమ్రాన్ హస్మీ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్లో ఆలియా లుక్స్, బ్యాక్‌గ్రౌండ్ ట్రాక్, ఫిల్మే మేకింగ్ స్టయిల్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో ట్రైలర్‌ను చూసేయండి.