ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఎప్పటికప్పుడు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాలానుగుణంగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలు సరికొత్త అవకాశాలకు దారులు చూపుతున్నాయి. ఐటీ ఉద్యోగం చేస్తున్న వారైనా… డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారెవరైనా సరే ట్రెండింగ్‌లో ఉన్న ఐటీ కోర్సుల్లో నైపుణ్యం కలిగి ఉండాల్సిందే. రకరకాల డిగ్రీల్లో ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం మాట ఎలా ఉన్నా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఐటీ కోర్సుల్లో నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం గ్యారెంటీ అని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
కంప్యూటర్ కోర్సులంటే మొదటి నుంచి అందరికీ గుర్తుకు వచ్చేది సీ, సీ ప్లస్‌ప్లస్, డాట్నెట్, జావా, టెస్టింగ్ టూల్స్, ఓరాకిల్, ఎస్‌క్యూల్, ఎస్ఎపీ, వెబ్‌డిజైనింగ్, హెచ్‌టీఎంఎల్… కానీ కాలం మారుతున్నట్లుగా ఐటీ రంగంలోనూ ఎన్నో మార్పులు శరవేగంగా మారిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా అత్యంత వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీ కన్నా సేవలు అందించే టెక్నాలజీలే విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. తాజాగా కొన్ని కోర్సులు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు బిటెక్, ఎంబీఏ డిగ్రీలు ఉన్న వారు కూడా ట్రెండింగ్‌లో ఉన్న ఐటీ కోర్సులను నేర్చుకుంటే చాలు ఐటీ ఉద్యోగం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
క్లౌడ్ కంప్యూటింగ్‌దే అగ్రస్థానం….
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ అత్యంత కీలకంగా మారింది. దీంతో ఒక కంపెనీ చెందిన డేటాను లేదా వ్యక్తులకు సంబంధించిన డేటా సమర్థవంతంగా నిర్వహించడంతో క్లౌడ్ టెక్నాలజీ కీలకంగా మారింది. డిజిటల్ డేటాకు మూడంచల్లో భద్రత కల్పించే క్లౌడ్ టెక్నాలజీ ఐటీ కోర్సుల్లో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం ఐటీ దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆన్లైన్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్లు క్లౌడ్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకలోకి తీసుకువచ్చాయి. వీటితో మరిన్ని కంపెనీ డేటా సెంటర్ల నిర్వహణ కోసం క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. భవిష్యత్‌లోనూ డేటా స్టోరేజ్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ విధానమే కొనసాగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ డేటా సెంటర్ల నిర్వహణ కోసం వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్న విషయాన్ని ఐటీ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
సర్టిఫికేషన్ కోర్సులు..
ఐటీ రంగంలో విస్తృతంగా వినియోగించే టెక్నాలజీలతో సర్టిఫికెట్ కోర్సులను పలు విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా తమ టెక్నాలజీలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి అమెజాన్ ఎడబ్ల్యూస్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ ఆజూర్ క్లౌడ్ ఇంజినీర్, గూగుల్ క్లౌడ్ ఇంజినీర్ ఇలా ఆయా కంపెనీలు ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీలతో సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా ఇతర కంపెనీలు కూడా సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తే సర్టిఫికెట్ కోర్సులకు గుర్తింపు ఇస్తున్నాయి. డిగ్రీతో పాటు సర్టిఫికెట్ కోర్సు చేసి ఉంటే అతనిలో నైపుణ్యం బాగా ఉంటుందని ఉద్యోగుల ఎంపిక సమయంలో ఐటీ కంపెనీలు గుర్తిస్తున్నాయి.
ట్రెండింగ్‌లో ఉన్న ఐటీ కోర్సులు..