18 ఏళ్లు నిండినవారందరికీ బూస్టర్ డోసు.. కానీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు నిండినవారందరికీ ఇక నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. ఈనెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా కోవిడ్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే బూస్టర్ డోసు తీసుకోవాలనుకునే 18 ఏళ్లు దాటినవాళ్లు అమౌంట్ చెల్సించాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వాళ్లకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చారు. కానీ 60 ఏండ్లలోపు వాళ్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఫస్ట్, సెకండ్ డోసులను ఉచితంగా ఇచ్చారు. హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రికాషన్ డోసును ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వరకు 15 ఏళ్లు దాటిన వారిలో 96 శాతం కోవిడ్ టీకా తీసుకున్నారు. సెకండ్ డోసు, బూస్టర్ డోసు మధ్య 90 రోజుల వ్యవధి ఉండాలి.
ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు మొదటిసారిగా 2021, జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభించగా, మార్చి 1 నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి వ్యాక్సినేషన్ అందించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడిన అందరికీ టీకా వేశారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించారు. 2022, జనవరి 3 నుంచి 15 -18 ఏండ్ల వయసున్న పిల్లలకు టీకాలు ఇచ్చారు. జనవరి 10వ తేదీ నుంచి వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ అందించారు. మార్చి 16న నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

