Night Curfew | పెరిగిన కరోనా కేసులు.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
Night Curfew | పెరిగిన కరోనా కేసులు.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ | పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ మధ్య, దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం

బెంగళూరు : పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ మధ్య, దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయంటూ దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కేరళతో సరిహద్దులో ఉన్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలను అనుమతి ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే ఈనెల 13వ తేదీ వరకూ బెంగళూరు నగర వ్యాప్తంగా నైట్‌కర్ఫ్యూ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ వెల్లడించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో నలుగురికి మించి ఉండరాదన్నారు. రాత్రి 9 గంటలకు ముందుగానే అన్ని వ్యాపారాలు నిలిపివేయాలన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఈ నిబంధన వర్తింస్తుందన్నారు.
బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిషేధాజ్ఞలను పొడిగించిన ఉత్తర్వులను అన్ని పోలీసుస్టేషన్లకు పంపారు. ఇదిలా ఉండగా బుధవారం కర్ణాకటలో 1,159 కొత్త కేసులు నమోదవగా.. 21 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,50,604కు పెరిగింది. బుధవారం నమోదైన 21 మరణాల్లో ఏడుగురు బెంగళూరు అర్బన్‌కు చెందిన వారు కాగా, దక్షిణ కన్నడలో ఐదుగురు, ఉడిపిలో ముగ్గురు, హాసన్‌లో ఇద్దరు మరణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

