పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా యువ సంచలనం కొకో గాఫ్ ముందంజ వేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో రెండో సీడ్ గాఫ్ 6-2, 6-4తో వాలెన్టోవాపై అలవోక విజయం సాధించింది.
ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన గాఫ్..ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసింది. మ్యాచ్‌లో రెండు ఏస్‌లు సంధించిన గాఫ్ 13 బ్రేక్పాయింట్లలో ఎనిమిదింటిని కాపాడుకుంది. మరోవైపు మిగతా మ్యాచ్‌ల్లో మాడిసన్ కీస్ 6-1, 6-3తో బౌల్టర్పై గెలిచారు.