హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సుల్లో పుట్టిన ఇద్దరు చిన్నారులకు సంస్థ ఎండీ సజ్జనార్ వినూత్నంగా బర్త్‌డే గిఫ్ట్ ప్రకటించా రు. జీవితకాలం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్ ఇచ్చినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30న నాగర్‌కర్నూల్ డిపో బస్సులో పెద్దకొత్తపల్లి సమీపంలో ఓ చిన్నారి, ఆసిఫాబాద్‌కు చెందిన బస్సులో సిద్దిపేట సమీపంలో డిసెంబర్ 7న మరో చిన్నారి జన్మించిన ట్టు పేర్కొన్నారు. ప్రయాణికులను మరింత ఆకర్షించేలా బస్డేను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి గురువారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బస్సు ల్లో ప్రయాణించాలని సూచించారు. ట్విట్టర్లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఖాతాను ఫాలో అవుతున్నవారి సంఖ్య రెండునెలల్లో 25 వేలు దాటింది.