భీమ్‌గల్/మోర్తాడ్, మే 25: ఉమ్మడి రాష్ర్టంలో పలు కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి, మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ (75) సోమవారం మరణించారు. కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతి చెందారు. వారికి కుమారుడు వాసుబాబు, కూతురు మాధవి ఉన్నారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
సంతోష్‌రెడ్డికి మాజీ మంత్రి వేముల పరామర్శ
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న వారి నివాసంలో సంతోష్‌రెడ్డి సతీమణి విజయ పార్థీవ దేహానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌రెడ్డిని పరామర్శించి, ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వేముల వెంట రాజారాం యాదవ్ ఉన్నారు.