
టోక్యో, నవంబర్ 14 : సామాన్యుడ్ని ప్రేమించి పెళ్లాడి రాజకుటుంబ హోదాను వదులుకున్న జపాన్ మాజీ రాకుమారి మాకో తన భర్త కెయ్ కొమురోతో కలిసి అమెరికా వెళ్లారు. తమ ప్రేమ, పెండ్లిపై జపాన్‌లో వస్తున్న విమర్శల నడుమ దేశాన్ని విడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు టోక్యో విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌కు బయలుదేరారు. ఈ దృశ్యాన్ని జపాన్ టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారంలో చూపించాయి.