హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్‌సెక్రటరీ నీరభ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా పనిచేశారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవీ కాలం మరో ఏడాది ఉన్నా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్‌సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.