హర్యానా మాజీ మంత్రి కన్నుమూత
హర్యానా మాజీ మంత్రి కన్నుమూత | హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు.

యమునానగర్ : హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు. ఈ క్రమంలో ప్రైవేటులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. కమలా వర్మ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. సుపరిపాలన పట్ల ఆమె ఉన్న అంకిత భావం.. ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తుందన్నారు.
హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధంకర్ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ హర్యానా యూనిట్ మొదటి అధ్యక్షురాలిగా పని చేసిన కమలా వర్మ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులతో కలిసి పని చేశారని ధంకర్ తెలిపారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. కమలా వర్మ 1977లో హర్యానాలోని యమునానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1977, 1987, 1996ల్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
ఆకాశమే హద్దుగా.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
09-06-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
వ్యాక్సినేషన్‌కు వెళ్లే ముందు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

