టేకులపల్లి : యువతకు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల( Drugs) జోలికి వెళ్లవద్దని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ ( CI Battula Satyanarayana) , ఆళ్ళపల్లి ఎస్సై సోమేశ్వర్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విద్యార్థులు టీనేజ్ వయసులో గంజాయి, హెరాయిన్, కొకైన్, మార్పిన్ లాంటి మత్తు పదార్థాలను సేవించరాదని అన్నారు. ఎవరైనా సేవిస్తే సమాచారం పోలీసులకు సమాచారం అందించాలని , సమాచారం అందించిన వారి వారి పేర్లను బహిర్గతం చేయమని పేర్కొన్నారు. యుక్త వయస్సులో యువత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని సాధించడానికి నిరంతరం కష్టపడి సాధించాలని సూచించారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం అంధకారమై జైలు జీవితాన్ని గడపాల్సివస్తుందని అన్నారు. . యువత డ్రగ్స్ దూరంగా ఇండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టేకులపల్లి జూనియర్ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.