HomeNewsFollow These Remedies To Stop Snoring Naturally
Snoring | గురక ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో తగ్గించుకోండి
గురకతో బాధపడే వారు రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. టీ స్పూన్ పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి తాగాలి. క్రమం తప్పకుండా వారం పాటు ఇలా చేస్తే గురక తగ్గుతుంది.
2/5
చాలామంది గురకను పెద్ద సమస్యగా చూడరు. మనం గురక పెడితే పక్కనవాళ్ల నిద్ర డిస్ట్రబ్ అవుతుంది.. అంతే కదా దీనికి ఆస్పత్రికి వెళ్లడం అని అనుకుంటుంటారు. కానీ గురక వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గురక రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా గురకను నివారించవచ్చు.
3/5
గురక పెట్టేవారు పడుకునే ముందు గుప్పెడు అటుకులను తింటే గురక రాకుండా ఉంటుంది. అలాగే గురక సమస్యతో బాధపడే వారు అతిగా తినకపోవడమే మంచిది. నిద్రించే ముందు గోరు వెచ్చని నీటిని గొంతులో కాసేపు ఆపి తాగడం వల్ల గురక రాదు.
4/5
గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత కారణంగా గురక బాధిస్తుంది. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతగా రిలాక్స్ అయిపోవడం వలన గురక మరింత ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గురక సమస్య తీవ్రతరం అవుతుంది. ఆల్కాహాల్‌కు దూరంగా ఉండమే మంచిది.
5/5
బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చు. నిద్రకు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకూడదు. అలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్‌ను తీసుకోవద్దు.
6/5
నిద్ర వేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒక వైపునకు ఒరిగి పగడుకోవాలి. మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోవాలి.