గద్వాల/అయిజ, సెప్టెంబర్ 28 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కాల్వలు, లిఫ్ట్‌లకు నీటిని ఎత్తిపోస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.316 టీఎంసీలు నిల్వ ఉన్నది.
కర్ణాటకలోని ఆర్డీఎస్కు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 1,527 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,007 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. అవుట్‌ఫ్లో 9,064 క్యూసెక్కులుగా ఉన్నది.