Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Bomb Threat | ఇజ్రాయెల్ (Israel) లోని టెల్అవీవ్ (Tel Aviv) నుంచి వియన్నా (Vienna) కు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ (Austrian Airlines) కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Bomb Threat : ఇజ్రాయెల్ (Israel) లోని టెల్అవీవ్ (Tel Aviv) నుంచి వియన్నా (Vienna) కు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ (Austrian Airlines) కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బల్గేరియా (Bulgaria) రాజధాని సోఫియా (Sofia) లో విమానం సురక్షితంగా దిగింది.
రొమేనియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందికి బాంబు బెదిరింపు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది ఫ్లైట్‌ను సోఫియాకు మళ్లించారు. ఆ విమానం సోఫియాలో ల్యాండ్ అయ్యే వరకు బల్గేరియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చింది. విమానం దిగిన వెంటనే అందులోని 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపుతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొన్నది. ఫ్లైట్‌లో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు వెళ్తున్న ఇజ్రాయెల్ యువ ప్రతినిధుల బృందం కూడా ఆ విమానంలో ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎయిర్‌లైన్స్ ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

