Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
రేవంత్ రెడ్డి చిన్న సోదరుడు అనుముల కృష్ణారెడ్డి దగ్గరికి ఆనాడు పార్టీ నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వాలని నా కొడుకుని పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు ఫండ్స్ ఇస్తమని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారన్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తెలిపారు.
Manne krishank | రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులంతా కొన్ని నెలల నుంచి ప్రస్తావిస్తున్న అంశం 22ఏ.. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం భూములను నిషేధిత భూములని చెప్పి దందాలు చేస్కోవడానికి, వీళ్ల దగ్గరికి వచ్చి సెటిల్మెంట్స్ చేసుకోవడానికి తీసుకున్న పెద్ద ఆయధం 22ఏ అన్నారు..
22 ఏ కంటే ముందు పెద్దలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.. చాలా సూటిగా ఒక పేరు చెప్పారు.. రేవంత్ రెడ్డి చిన్న సోదరుడు అనుముల కృష్ణారెడ్డి దగ్గరికి ఆనాడు పార్టీ నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వాలని నా కొడుకుని పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు ఫండ్స్ ఇస్తమని అన్నారన్నారు. అనుముల కృష్ణారెడ్డి కేవలం ఎమ్యేల్యేలను బెదిరిస్తున్నడు.. డబ్బులు తీసుకుంటున్నడా అనుకుంటే అలాగే కాదు.. భూ దందాలు కూడా చేస్తున్నరన్నారు. మనకు దొరికింది ఒకటి.. దొరకంది ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నయో రేవంత్ రెడ్డి అయితే బయటకు వచ్చి విచారణ చేపట్టరు. సీబీఐ విచారణ చేస్తే 22ఏలో ఎన్నెన్ని కుటుంబాల భూములు వాళ్ల పేరున వేసుకున్నరో.. నిషేధిత భూములను సెటిల్మెంట్స్ చేసుకుంటున్నరో స్పష్టంగా అర్థమవుతదన్నారు.
మొదటి పార్ట్నర్ రేవంత్ రెడ్డి తమ్ముడు..
చేవెళ్ల పరిధిలోని చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. కానీ 363 సర్వే నంబర్లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 ఒక్క భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అసైన్డ్ భూమి నుంచి ఆ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చారు. 363 సర్వే నంబర్లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమి కోట శ్రీకాంత్ రెడ్డి అనే R9 కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి పేరిట, చేవెళ్ల నవనీత ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. ఈ R9 కన్స్ట్రక్షన్స్ మొదటి పార్ట్నర్ , యజమాని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి అని అన్నారు.
R9 కన్స్ట్రక్షన్స్ కంపెనీ మంచిరేవులలో 75 కోట్ల విల్లాలో ఉంది. 22A తీసుకొచ్చింది ఇలాంటి భూములను కొల్లగొట్టడానికే.. ఇలాంటి కుంభకోణాలు చేయడం వల్లనే రూ.50,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. RR ట్యాక్స్ అని చెప్పే బీజేపీ, ఇన్ని స్కాంలు బయటపడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది..? అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందా పూర్తి ఆధారాలతో బయటపెట్టిన మన్నె క్రిశాంక్
ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు
చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు
అసైన్డ్ భూమి నుంచి ఆ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చారు
363 సర్వే నంబర్లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది
ఈ భూమి కోట శ్రీకాంత్ రెడ్డి అనే R9 కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి పేరిట, చేవెళ్ల నవనీత ద్వారా రిజిస్ట్రేషన్ అయింది
ఈ R9 కన్స్ట్రక్షన్స్ మొదటి పార్టనర్, యజమాని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి
ఈ కంపెనీ మంచిరేవులలో 75 కోట్ల విల్లాలో ఉంది
22A తీసుకొచ్చింది ఇలాంటి భూములను కొల్లగొట్టడానికే
ఇలాంటి కుంభకోణాలు చేయడం వల్లనే రూ.50,000 కోట్లు దోచుకున్నారు
RR ట్యాక్స్ అని చెప్పే బీజేపీ, ఇన్ని స్కాంలు బయటపడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది?
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

