పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం
పిడుగుపాటు | బిహార్‌లోని సహర్సా జిల్లాలోని సిమ్రీ బక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిడుగుపాటుకు ఐదుగురు మృత్యువాతపడ్డారు.

పాట్నా : బిహార్‌లోని సహర్సా జిల్లాలోని సిమ్రీ బక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిడుగుపాటుకు ఐదుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం వర్షం కురిసే సమయంలో కొంత మంది పిల్లలు చంకా గ్రామంలోని పండ్ల తోటలో పండ్లు తీస్తున్నారని పోలీసులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో పిడుగుపడడంతో నలుగురు పిల్లలతో సహా ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మనీషా కుమారి, సంజన కుమారి, కైలాష్ కుమార్, 75 ఏళ్ల మహిళ భదయ్య దేవిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు పిల్లల వివరాలు తెలియరాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం.. రూ.4లక్షల పరిహారం అందజేయనున్నట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ) వీరేంద్రకుమార్ పేర్కొన్నారు.
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Five Killed
- Lightning
- Saharsa
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

