ETPL : టీ20ల్లో బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యే బౌలర్లే ఎక్కువ. హిట్టర్ల జోరు ముందు మ్యాచ్‌లో ఒకట్రెండ్ వికెట్లు తీస్తే గొప్ప అనుకునే రోజులివి. అయితే.. కొందరు బౌలర్లు సంచలన ప్రదర్శనతో ఐదేసి వికెట్లు ఔరా అనిపించారు. అది కూడా ఒకే ఎడిషన్‌లో ఏకంగా ఐదుగురు ఐదేసి వికెట్లతో రికార్డు నెలకొల్పారు. అలాఅనీ ఐపీఎల్(IPL), బిగ్‌బాష్, కరీబియన్ ప్రమీయర్ లీగ్ వంటి పాపులర్ లీగ్స్‌లో కాదు ఈ ఏడాది మొదలైన యూరోపియన్ లీగ్(ETPL)లోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇంతకూ ఆ పాంచ్‌పటాకా యోధులు ఎవరంటే..?
తుఫాన్ ఇన్నింగ్స్‌లతో భయపెట్టే చిచ్చరపిడుగుల ఆధిపత్యం కొనసాగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్లో బౌలర్ల పైచేయి సాధించడం చాలా తక్కువ. మేటి బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేస్తూ రెండు, మూడు వికెట్లు తీయడమే గొప్ప అనకుంటున్న ఈ రోజుల్లో..ఐదేసి వికెట్లతో హల్చల్ చేశారీ ఐదుగురు.
Most five-wicket hauls in an edition of a men’s franchise T20 league:
𝟓 – 𝐄𝐓𝐏𝐋, 𝟐𝟎𝟐𝟔
4 – IPL, 2011
4 – BPL, 2017
4 – BPL, 2019-20
4 – BBL, 2020-21
4 – BBL, 2021-22
4 – IPL, 2022
4 – IPL, 2023 pic.twitter.com/Di4OW2YNtR— Cricinfo (@cricinfo) September 14, 2026
ఈ ఏడాది షురూ అయిన యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోనే వీరు ఈ ఫీట్ సాధించారు. ట్రెంట్ బౌల్ట్(5-24), అన్రిచ్ నోర్జి(5-11), మిచెల్ శాంట్నర్(5-16), క్రెగ్ యంగ్(5-21), మైఖేల్ బ్రేస్‌వెల్(5-12)లు ఈ టోర్నీలో బ్యాటర్లను వణికించి ఐదు వికెట్ల ప్రదర్శనతో అబ్బురపరిచారు. అయితే.. వీరిలో క్రెగ్ మినహా.. నలుగురు బౌలర్లు ఐపీఎల్లో మెరిసిన వాళ్లే కావడం విశేషం.