Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
భారత వైద్యరంగంలో అరుదైన ఘనత నమోదైంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు తల్లి గర్భంలోనే ఉన్న శిశువుకు వెన్నెముక సంబంధిత లోపాన్ని సరిచేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఓపెన్ ఫీటల్ సర్జరీ నిర్వహించారు. 25 వారాల గర్భధారణ సమయంలో నవంబర్ 12న ఈ శస్త్రచికిత్స చేపట్టారు.
Fetal Back Surgery | భారత వైద్యరంగంలో అరుదైన ఘనత నమోదైంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు తల్లి గర్భంలోనే ఉన్న శిశువుకు వెన్నెముక సంబంధిత లోపాన్ని సరిచేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఓపెన్ ఫీటల్ సర్జరీ నిర్వహించారు. 25 వారాల గర్భధారణ సమయంలో నవంబర్ 12న ఈ శస్త్రచికిత్స చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ ప్రక్రియలో 30 మందికి పైగా వైద్యులు, నర్సులు వివిధ విభాగాల నుంచి పాల్గొన్నారు. శస్త్రచికిత్సకు ముందు ఐదు వారాలకు పైగా శిశువు ఆరోగ్య పరీక్షలు, స్కానింగ్, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పుట్టిన తర్వాత చికిత్స చేసే బదులు గర్భంలో ఉండగానే లోపాన్ని సరిచేయడం ద్వారా శిశువు నాడీవ్యవస్థకు మరింత నష్టం జరగకుండా అడ్డుకోవడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.
అసలు సమస్య ఏమిటి..?
శిశువుకు ఉన్న సమస్యను లంబోసాక్రల్ మైలోమెనింగోసీల్ అంటారు. ఇది స్పైనా బైఫిడా అనే పుట్టుకతో వచ్చే లోపంలో అత్యంత తీవ్రమైన రూపం. గర్భధారణ ప్రారంభ దశలో మెదడు, వెన్నెముకగా అభివృద్ధి చెందే నాడీ నాళం పూర్తిగా మూసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో వెన్నెముకలో రంధ్రం ఏర్పడి వెన్నెముక, దాని చుట్టూ ఉండే పొరలు బయటకు పొడుచుకొస్తాయి. దీనివల్ల నరాలు దెబ్బతిని కాళ్ల కదలికలు, మూత్ర విసర్జన, మల విసర్జన నియంత్రణపై ప్రభావం పడుతుంది. మెదడులో ద్రవం పేరుకుపోయే హైడ్రోసెఫాలస్ సమస్య కూడా వస్తుంది. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత ఈ లోపానికి శస్త్రచికిత్స చేస్తారు. అయితే గర్భంలోనే మరింత నష్టం జరగకుండా ముందుగానే సరిచేయడం ఈ చికిత్స లక్ష్యం.
శస్త్ర చికిత్స ఎలా చేశారు..?
ఈ శస్త్రచికిత్సలో తల్లి పొత్తికడుపు, గర్భాశయానికి కోత పెట్టి శిశువు ప్రభావితమైన వెన్నెముక భాగాన్ని బయటకు కనిపించేలా చేస్తారు. శిశువును గర్భం నుంచి బయటకు తీయకుండానే ప్రత్యేక పరికరాలు, సూక్ష్మదర్శిని సహాయంతో వెన్నెముకలోని లోపాన్ని సరిచేస్తారు. అనంతరం గర్భాశయం, పొత్తికడుపు కోతలను మూసివేస్తారు. ఎయిమ్స్ వైద్యుల ప్రకారం, శస్త్రచికిత్స అనంతరం తల్లి, శిశువు పరిస్థితి నిలకడగా ఉంది. అయితే ప్రసవం జరిగే వరకు, ఆ తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ అవసరం. ఈ చికిత్స లోపాన్ని పూర్తిగా తొలగిస్తుందని లేదా శిశువుకు ఎలాంటి నరాల సమస్యలు ఉండవని హామీ ఇవ్వదు. మరింత నష్టం జరగకుండా పరిమితం చేయడమే దీని ఉద్దేశం. అమెరికాలో నిర్వహించిన అధ్యయనాల్లో గర్భంలోనే శస్త్రచికిత్స చేయించుకున్న పిల్లలకు పుట్టిన తర్వాత చికిత్స పొందిన వారితో పోలిస్తే కొన్ని నాడీ సంబంధిత ప్రయోజనాలు కనిపించాయి.
ఫోలిక్ యాసిడ్‌తో ఇలాంటి సమస్యలు రావు..
అయితే గర్భంలో శస్త్రచికిత్స చేయడం తల్లికి, శిశువుకు కొన్ని ప్రమాదాలను కలిగిస్తుంది. ముఖ్యంగా నెలలు నిండకముందే ప్రసవం కావడం, ఉమ్మనీరు ముందుగానే బయటకు రావడం, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రతి గర్భిణికి ఈ చికిత్స అనుకూలం కాదు. నిపుణుల బృందం పూర్తి పరీక్షలు నిర్వహించి తగిన కేసులను మాత్రమే ఎంపిక చేయాలి. ఎయిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సను ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఉచితంగా నిర్వహించడం విశేషం. మరోవైపు, ఇటువంటి నాడీ నాళ లోపాలను నివారించేందుకు గర్భం దాల్చాలని ప్రణాళిక వేసుకునే మహిళలు రోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. గర్భధారణకు ముందే ప్రారంభించి తొలి 12 వారాల వరకు కొనసాగించడం వల్ల ఈ లోపాల ముప్పు తగ్గుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

