రవీంద్రభారతి, జూన్ 19: ఇంజినీరింగ్ కౌన్సిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్ద ని, 18 ఏండ్ల నుంచి ఇస్తున్న విధంగా నే అడ్మిషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృ ష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌కు ఆయన లేఖ రాశారు. ఇ టీవల ప్రభుత్వం ఇచ్చినా జీవో 8,9ల్లో స్పష్టత లేకపోవడంతో తీవ్ర గందరగో ళం ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 33 నెలల్లోనే 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని, 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో 10వేల కోట్లు అప్పు తెస్తే ఎవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్తులో భారీ ఉద్యమాలు తప్పవని, దీంతో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించా రు. జూలై మొదటి వారంలో ఐదు లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తామని పేర్కొన్నారు.