మ్యాడ్, మ్యాడ్ స్కేర్, ఆయ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నార్నే నితిన్ హీరోగా ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనున్నది. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక కేవీఎన్ పొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. శుక్రవారం నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ని మేకర్స్ విడుదుల చేశారు.
ఇన్‌స్టా పోస్ట్ తరహాలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ యూత్‌ని ఆకట్టుకుంటున్నదని మేకర్స్ చెబుతున్నారు. నీలాకాశం నేపథ్యంలో, ఓ భవనం అంచున కూల్‌గా కూర్చున్న నార్నే నితిన్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ‘ఆకాశంలో ఉంటుంది మూన్.. నువ్వే నా లైఫ్‌కి క్వీన్..’ అనే ఫన్నీ లైన్‌తో పాటు వేలాది లైక్స్, కామెంట్స్, ట్రెండీ హ్యాష్‌ట్యాగ్స్ ఈ పోస్టర్‌కి ఆకర్షణగా నిలిచాయి. నితిన్ బావ ఎన్టీఆర్ ఈ పోస్ట్‌కి లైక్ కొట్టినట్టు చూపించడం అభిమానుల్ని అకట్టుకుంటున్నది. ఈ చిత్రానికి కెమెరా: రామమారుతి.ఎం.