Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
Rythu Runa Mafi | రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ అమల్లో అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల పేరుతో జరుగుతున్న జాప్యం బయటపడింది. ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద అర్హత ఉన్నా,
Rythu Runa Mafi |మెదక్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ అమల్లో అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల పేరుతో జరుగుతున్న జాప్యం బయటపడింది. ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద అర్హత ఉన్నా, నెలల తరబడి పరిహారం అందకపోవడంతో ఓ మహిళా రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెదక్ జిల్లాకు చెందిన బనప్పగారి మంగమ్మ ఎస్బీఐ మెదక్ శాఖలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణం తీసుకున్నారు. ఆమెకు మొత్తం రూ.2.13 లక్షల మేర రుణ బకాయి ఉండగా, ప్రభుత్వం 2024 జూలై 15న జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 567 ప్రకారం రూ.2 లక్షలకు మించిన రుణ మొత్తాన్ని ముందుగా చెల్లిస్తే మిగిలిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ పొందేందుకు అవకాశం ఉన్నది.
ఈ మేరకు 2024 ఆగస్టులో రెండు విడతలుగా రూ.23 వేలు బ్యాంకులో జమ చేసి తన బకాయిని రూ.1,98,145.73కు తగ్గించుకున్నారు. అయినప్పటికీ, ప్రభు త్వం రుణమాఫీ మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేయలేదు. సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ మార్గదర్శకాల పేరుతో రుణమాఫీని నిలిపివేయడంపై రైతు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వంతోపాటు ఎస్బీఐ నుంచి కూడా కౌంటర్లు కోరింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

