హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్/ తెలుగుయూనివర్సిటీ: ప్రము ఖ కవి, రచయిత, సాహితీవేత్త ప్రొఫెసర్ ఎండ్లూ రి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారు. కొం తకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ న శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి దంపతులకు 1959లో నిజామాబాద్‌లో జన్మించిన సుధాకర్.. హైదరాబాద్‌లోని వీధి బడిలో విద్యాభాస్యం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో సేవలందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాలను తెలుగులోకి అనువదించారు. అనేక రచనలు చేశారు.
వర్తమానం కవితలు, జాషువా నా కథ, కొత్త గబ్బిలం దళిత దీర్ఘ కావ్యం, నా అక్షరమే నా ఆయుధం, మల్లె మొగ్గల గొడుగు- మాదిగ కథ లు, నల్లద్రాక్ష పందిరి, ఉభయ భాషా కవిత్వం, పుష్కర కవితలు, వర్గీకరణీయం, గోసంగి దళిత దీర్ఘకావ్యాలు, ఆటా జనికాంచె-అమెరికా యా త్రా కవితలు, జాషువా సాహిత్యం-దృక్పథం- పరిణామం పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం, కథానాయకుడు జాషువా జీవిత చరిత్ర, నవయుగ కవి చక్రవర్తి జాషువా మోనోగ్రాఫ్, కావ్యత్రయం దీర్ఘ కావ్య సంకలనం, సాహితీసుధ దళిత సాహిత్య వ్యాసాలు, తెలివెన్నెల సాహిత్య వ్యాసాలు లాం టి మరెన్నో గ్రంథాలను వెలువరించారు. ఎం డ్లూరి మృతి పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్‌రావు , మాజీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, యు వకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, హెచ్‌సీయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పలువురు కవులు, రచయితలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.