Maoists | ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్..!
ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
- ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తొలిసారి స్వాధీనం చేసుకొన్న బలగాలు
Maoists | కొత్తగూడెం క్రైం, జూన్ 23: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు సుక్మా జిల్లాలోని కొరాజ్‌గూడ అడవుల్లో మావోయిస్టుల స్థావరంపై దాడులు చేశారు. అక్కడ నకిలీ నోట్ల పేపర్లు, వాటి తయారీ యంత్రాలు(కలర్ జిరాక్స్, స్కానర్స్), ఇన్వర్టర్, క్యాట్రిడ్జులు, ద్రవ రసాయనాలు లభించాయి. రెండు తుపాకులు, వాకీ టాకీలు, విప్లవ సాహిత్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్నడూ లేనివిధంగా మావోయిస్టులు నకిలీ నోట్ల ముద్రణకు పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి
చత్తీస్‌గఢ్‌లోనే సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో ఏడుగురి గాయాలయ్యాయి. జగర్గుండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకొన్నది. మృతిచెందిన జవాన్లు విష్ణు, శైలేందర్ అని పోలీసులు తెలిపారు. మరోవైపు, మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ నాయకుడు గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు తన భార్య సంగీత అలియాస్ లలితతో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

