F3 movie | విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్3. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్నా, మెహరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2019 లో సంక్రాంతి కి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ‘మా షూటింగ్ జర్నీ పూర్తైంది..మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది !….వస్తే కొద్దిగా ముందుగా..వెళ్లినా కొద్దిగా వెనుకగా !.. థియేటర్స్ కు రావడం మాత్రం పక్కా..’ అంటూ ట్వీట్ చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్రిల్28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.