టీఆర్ఎస్ నేత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత

ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్యర్యంలో అతడి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గురువారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ తరఫున రూ.5 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశారు. భీమేశ్వరరావు కుమారుడు సాయికిరణ్‌కు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. భీమేశ్వరరావు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్‌గా, అలుబాక టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ శ్రేణులను గుండెల్లో పెట్టుకుంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అందుకే పార్టీ సభ్యత్వం కలిగిన క్యాడర్‌కు రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి బాసటగా నిలిచిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్మే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- exgratia
- family
- KTR
- TRS leader
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

