PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదంప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) జమచేసే ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒక్కసారే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేకుండా విడతల వారీగా విత్‌డ్రా చేసుకునేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్రణాళిక (ఎస్‌డబ్ల్యూపీ)ని అమలులోకి వచ్చింది.
PF Withdraw | న్యూఢిల్లీ, నవంబర్ 19 : ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) జమచేసే ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒక్కసారే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేకుండా విడతల వారీగా విత్‌డ్రా చేసుకునేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్రణాళిక (ఎస్‌డబ్ల్యూపీ)ని అమలులోకి వచ్చింది. ఈ సదుపాయం పూర్తిగా ఖాతాదారుని స్వచ్ఛందమే. మన ఖాతాలో నిల్వ ఉన్న మొత్తంపై కేవలం వడ్డీ మాత్రమే తీసుకునే సదుపాయం కూడా దీనిలో ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) 240వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారిక ప్రకటన తెలిపింది.
కొత్త విధానం ప్రకారం సభ్యులు తమ పీఎఫ్ పొదుపును క్రమం తప్పకుండా వాయిదాల్లో తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, త్రైమాసిక లేదా ఆరు నెలల వాయిదాల్లో పొందవచ్చు. ఖాతాలో మిగిలిన సొమ్ముపై రాబడులు కొనసాగుతాయి. దీంతో పొదుపు మొత్తం అలాగే ఉండటంతో పాటు పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం అందుతుందని పేర్కొంది వాయిదాల చెల్లింపు కాలంలో సభ్యుడు మరణిస్తే, నామినీలు లేదా ఆధారపడిన వారు ఖాతాలో మిగిలిన సొమ్మును ఒకేసారి తీసుకోవచ్చు లేదా నిర్ణీత కాల వ్యవధిలో చెల్లింపులు కొనసాగించుకోవచ్చు. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం-2026లో సవరణలకు సీబీటీ ఆమోదం తెలిపింది.
ఇక 90 శాతం వరకు పీఎఫ్ విత్‌డ్రాయల్!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలను సడలించింది. నిర్దిష్ట షరతులకు లోబడి 55 ఏండ్లు నిండకముందే అర్హులైన సభ్యులు తమ పీఎఫ్ పొదుపులో 90 శాతం వరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. పదవీ విరమణ కోసం కొంత పొదుపు మిగిలేలా ఈ మార్పులు చేసినట్టు మనీకంట్రోల్ కథనం తెలిపింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత పీఎఫ్ ఉపసంహరణకు వేచిచూడాల్సిన కాలాన్ని 12 నెలల నుంచి రెండు నెలలకు తగ్గించినట్టు తెలిపింది. 2026 పీఎఫ్ పథకంలోని సవరించిన నిబంధనల ప్రకారం ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన అర్హులైన సభ్యులు, ఉపసంహరణ ఉద్దేశం, వర్తించే షరతులను బట్టి తమ పీఎఫ్ పొదుపును ముందుగానే పొందే అవకాశం ఉన్నది. అయితే, ప్రతి సభ్యుడు ఏ కారణానికైనా తన పీఎఫ్ నిల్వలో 90 శాతం తీసుకోవచ్చని ఈ నిబంధనలు చెప్పడం లేదని కథనం స్పష్టం చేసింది. సభ్యుడి అర్హత, ఉపసంహరణ ఉద్దేశం, పథకంలో నిర్దేశించిన పరిమితుల ఆధారంగానే అందుబాటులో ఉండే మొత్తం నిర్ణయమవుతుందని తెలిపింది. పదవీ విరమణ పొదుపు ముందుగానే పూర్తిగా ఖర్చుకాకుండా చూడటమూ ఈ మార్పుల ఉద్దేశమని పేర్కొంది.
ఎవరు అర్హులంటే…!
వైద్య చికిత్స కోసం సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల అర్హతగల వైద్య ఖర్చులకు నగదు తీసుకోవచ్చని పత్రిక తెలిపింది. అర్హత గల విద్యా ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని పేర్కొంది. సభ్యుడి లేదా కుటుంబ సభ్యుల వివాహ ఖర్చులకు పీఎఫ్ పొదుపును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇల్లు లేదా స్థలం కొనుగోలు, నివాస గృహ నిర్మాణం, గృహ రుణం చెల్లింపు, ఉన్న ఇంటి మరమ్మతుల కోసం కూడా ఉపసంహరణకు అనుమతి ఉండొచ్చని పేర్కొంది. పథకంలో పొందుపరిచిన మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ సభ్యులు నగదు తీసుకోవడానికి అర్హులవుతారని తెలిపింది. అయితే, విభాగాన్ని బట్టి తీసుకునే మొత్తం మారవచ్చని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EPFO
- pf account
- PF Withdraw
RELATED ARTICLES
తాజా వార్తలు
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

