ఐక్యతతోనే ఈయూ కూటమి విజయం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఉన్న కూటమితో తలపడి, వారిని ఓడించి ఘనవిజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) కూటమి నాయకత్వానికి ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌రావు,
- అధికార కూటమిని ఓడించడం అభినందనీయం : ఏపీ ఈయూ
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఉన్న కూటమితో తలపడి, వారిని ఓడించి ఘనవిజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) కూటమి నాయకత్వానికి ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌రావు, ప్రధాన కార్యదర్శి జీవీ నర్సయ్య ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. అధికార బలం కంటే కార్మికుల విశ్వాసమే గొప్పదని, కార్మికుల ప్రయోజనాల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సాగించే పోరాటాలకే ఉద్యోగులు పట్టం కడతారని టీఎస్ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని పేరొన్నారు. ఆర్టీసీ ప్రభుత్వ విలీన లక్ష్యాన్ని ఈయూ నాయకత్వంలో సాధించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తామని దామోదర్‌రావు, నర్సయ్య తెలిపారు.
‘ఈయూ’ గెలుపు కార్మికుల విజయం
- కూటమి ప్రధాన కార్యదర్శి వెంకన్న, అధ్యక్షుడు బాబు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా సాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా ఏకపక్షంగా ఈయూ కూటమిని గెలిపించడం అభినందనీయమని, ఈ గెలుపు కార్మికుల విజయమని కూటమి ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, అధ్యక్షుడు బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో జేఏసీ కూటమిగా ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ సంఘాలు కలిసి పోటీచేశాయని, కూటమి మద్దతుతో ఈయూ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మెజారిటీతో విజయబావుటా ఎగురవేసిందని గుర్తుచేశారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన అన్ని సంఘాల రాష్ట్ర, జోనల్, రీజినల్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా మణులు, ఏఐటీయూసీ నాయకులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

