మహారాష్ట్రలో జమ్మి ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మిచెట్టు ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా ప్రతి గ్రామం, ఆలయంలో మొకలు నాటేందుకు చేపట్టిన ‘ఊరూరికో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమం ఇప్పుడు మహారాష్ట్రకు విస్తరించింది.
- గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా శమీ వృక్షాల పెంపకం!
- ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో మహారాష్ట్రలో పచ్చదనానికి శ్రీకారం
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మిచెట్టు ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా ప్రతి గ్రామం, ఆలయంలో మొకలు నాటేందుకు చేపట్టిన ‘ఊరూరికో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమం ఇప్పుడు మహారాష్ట్రకు విస్తరించింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో నవరాత్రి శుభ ముహూర్తాన్ని పురస్కరించుకొని ఆదివారం సోనెపేట్లోని నందికేశ్వర మఠంలో రాష్ట్రవ్యాప్త వృక్షారోపణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మహారాష్ట్ర వీరశైవ లింగాయత శివాచార్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నందికేశ్వర శివాచార్య మహారాజ్ చేతుల మీదుగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ నాయకత్వంలో ఆరో సంవత్సరంలో కి అడుగుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా, మ హా రాష్ట్రలోని ప్రతి గ్రామం, దేవాలయం, మఠం, ఇంటింటా శమీ (జమ్మి) వృక్షాలను నాటి సంరక్షించనున్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ మహారాష్ట్ర సమన్వయకర్త సుధీర్ బిందు, ప్రధానోపాధ్యాయులు మాణిక్‌ని లాంగే, ప్రదీప్ గైక్వాడ్, రాజ్‌కుమార్ ధాబ డే, రైతు నేత విశ్వంభర్ గోర్వే, జర్నలిస్టు సోమనాథ్ నాగురే తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

