బొడ్డెమ్మ పండగ.. పల్లె సంస్కృతికి ప్రతీక
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో పూలకు, ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ నేలపై తరతరాలుగా కొనసాగుతున్న పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు. మన పూర్వీకుల జీవన విధానాన్ని, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని, కుటుంబ బంధాలను ప్రతిబింబించే సాంస్కృతిక వేడుకలు. అలాంటి ప్రత్యేకమైన పండగల్లో బొడ్డెమ్మ పండుగ ఒకటి. తెలంగాణ అంటే బతుకమ్మ. బతుకమ్మ అంటే తెలంగాణ.
బతుకమ్మ పుట్టుకకు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంట్లో అందరికీ ఆడపడుచులతో ఆత్మీయ బంధం ఉ న్నట్టే బతుకమ్మ పండగతో కూడా బంధం తెలంగాణలో ప్రత్యేకం. భాద్రపద మాసంలో వచ్చే పెత్తరమావాస్య ముందు తొమ్మిది రోజుల ముందు నుంచే ‘బొడ్డెమ్మ’ పండుగతో బతుకమ్మ పండుగ వేడుకలు మొదలవుతాయి. కొన్ని గ్రామాల్లో కొందరు బొడ్డెమ్మతో మొదలుపెట్టి తర్వాత తొమ్మిది రోజులు దేవీనవరాత్రుల్లో బతుకమ్మని, దుర్గాదేవిని కూడా ఆరాధిస్తుంటారు. ఈ పండగలో భక్తి, ఆనందం, ప్రకృతి, ప్రేమ కలగలిసి కనిపిస్తాయి.
పొలం పనులు ఇతర కాయకష్టం చేసే మహిళలు పాడే ఆట పాటలతోనే అసలైన బతుకమ్మ అందచందాలు. జీవిత అనుభవాలకు దగ్గరగా ఉండి అందర్నీ చలింపజేస్తాయి. జీవితానుభవాలు, కష్టసుఖాలు, ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు, జానపద కథల్లో చెప్పే కథానాయకులు, నమ్మకాలు, మంత్రతంత్రాలు, అదృశ్యశక్తులు, అభూత కల్పనలు, పురాణాలు, సీతారాముల పచ్చీసు, ఊర్మిళ నిద్ర, సారంగధరుడి చిన్నమ్మ కష్టాలు, పెండ్లి అప్పగింతల పాట ఇలా ఒకటి కాదు, ఎన్నో విషయాలను పాటలుగా మలిచి రోజూ రెండు మూడు గంటలు ఆగకుండా పాడుతారు. ఒక్కోసారి పాటలు కూడా ఒకరోజులో అయిపోయే కథగా కాకుండా రెండుమూడు రోజుల వరకు పొడిగింపుగా పాడేవారు. ఈ పండుగలో వినిపించే జానపద గీతాలు తెలంగాణ పల్లె జీవనానికి అద్దం పడతాయి.
ఫొటోలు, వీడియోలు లేని కాలంలో మనసులో పదిలంగా ఉండే బతుకమ్మ ఆరాధన ఇప్పుడు మీడియా పుణ్యమా అని ఎంతోమందికి చేతినిండా పని కల్పించింది. ఏదేమైనా బతుకమ్మను ఒక ఆరాధన పూర్వకంగా పేర్చడం, దేవుడితో సమంగా దేవుడి ఇంట్లో పెట్ట్టి భక్తితో పసుపు గౌరిని చేసి కలిగిన రీతిలో రకరకాల వంటలతో నైవేద్యం పెడతారు. నీళ్లలో నిమజ్జనం చేసేటప్పుడు పసుపు గౌరీదేవిని కుంకుమ, పులుసుచద్దుల ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటూ ఆప్యాయంగా బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఇక సద్దుల బతుకమ్మ వైభవం ఇంతా అంతా కాదు. ఆ రోజు బతుకమ్మ దగ్గర పలుకరించుకోని పడతులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ పండుగ ఉయ్యాల పాటలు ఎప్పుడూ అమ్మాయిల జీవితాల ప్రతిబింబాలు. బతుకమ్మ సంబురాలు మాత్రం తెలంగాణ ఆడపడుచులకు ఎన్నో రోజులు మంచి జ్ఞాపకాలు.
బి.అనసూయ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

