చెప్పులంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అవసరానికి అవసరం, ఫ్యాషన్‌కు ఫ్యాషన్! ఇంట్లో ఎన్ని జతలున్నా మనసు తృప్తి పడదు. ప్రతి డ్రెస్కూ మ్యాచింగ్ కావాల్సిందే. ప్రత్యేక సందర్భాల్లో వేసుకోవడానికి లిమిటెడ్ ఎడిషన్ లేకపోతే మనసొప్పదు. ఇలాంటి పాదరక్షల ప్రియుల కోసమే వివిధ డిజైన్లలో కాలిజోళ్లు వస్తున్నాయి. తయారీదారులు కూడా తమకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకుని, తమదైన శైలిలో మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
‘ది మిస్’ అనే స్టార్టప్ అందంగా ఎంబ్రాయిడరీ చేసిన చెప్పులను మార్కెట్లో విక్రయిస్తున్నది. ఇవి యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా గ్రామీణ స్త్రీలకు ఉపాధినీ కల్పిస్తున్నది.. ‘ది మిస్’. వీటిని ఆన్ లైన్లోనూ కొనుక్కోవచ్చు.