Eko Movie OTT | మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ వేదికగా వచ్చి అలరించాయి. అయితే గతేడాది ‘కిష్కింధ కాండం’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు దిన్జిత్ అయ్యతన్ నుంచి వచ్చిన మరో అద్భుత దృశ్యకావ్యం ఎకో (Eko). అలపుజా జింఖానా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు సందీప్ ప్రదీప్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా.. వినీత్, నరైన్ కీలక పాత్రల్లో మెరిశారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కేరళ మరియు కర్ణాటక సరిహద్దులోని కాట్టుకున్ను అనే అటవీ ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అడవిలోని రహస్యాలు, మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య ఉండే సున్నితమైన, అంతుచిక్కని బంధం చుట్టూ దర్శకుడు ఈ మిస్టరీని తెరకెక్కించాడు.
Chila sathyangal ethra shramichaalum kandethanaakilla pic.twitter.com/9KcZSb43Wp
— Netflix India South (@Netflix_INSouth) December 26, 2025