ప్రవహించలేనప్పుడు
ఎగిసి పడాలి
సముద్ర కెరటంలా..!
విస్తరించ వీలు కానప్పుడు
ఆకాశమెత్తు ఎదగాలి
హిమవత్ పర్వతంలా..!
నేలబారుతనం చేతకానప్పుడు
అమృతధారవై కురవాలి
నేలరాలే వానచినుకులా!
కొనమన్నది కొననప్పుడు
అస్తిత్వ నినాదమై నిలదీయాలి
నేల తల్లి ఆకాంక్షలా..!
వద్దు వద్దన్నది అమ్ముతున్నప్పుడు
బొగ్గు బాయిలా రగిలిపోవాలి
వెలుగు దీపం పిడికిలెత్తినట్లుగా..!
ఆశలన్నీ అడుగంటినప్పుడు
ఆర్తినిండిన అనలగీతంలా
విమోచనకు తలుపులెత్తాలి!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261