హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఏపీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ఆయనను అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లిలోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.