సులభంగా వాహన యాజమాన్య బదిలీ
ఇతర రాష్ర్టాల వాహనాలను కొనుగోలు చేసే తెలంగాణ వాసులకు, మన రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలను ఇతర రాష్ర్టాల్లోని వారికి అమ్మేవారికి యాజమాన్య హక్కుల బదిలీలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించినట్టు తెలంగాణ రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.
- అడ్డంకులను తొలగించిన రాష్ట్ర రవాణా శాఖ
- ఎన్వోసీ, ఈ-కేవైసీ అప్డేట్ కూడా సులువే
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల వాహనాలను కొనుగోలు చేసే తెలంగాణ వాసులకు, మన రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలను ఇతర రాష్ర్టాల్లోని వారికి అమ్మేవారికి యాజమాన్య హక్కుల బదిలీలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించినట్టు తెలంగాణ రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా మూడు కీలక సేవలను ఆన్లైన్లోనే పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
తద్వారా వాహన యాజమాన్య బదిలీ (ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్), ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని తరలించేందుకు ఎన్వోసీ, వాహన యజమానుల ఈ-కేవైసీ అప్డేట్ డిజిటల్ విధానంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. యాజమాన్య బదిలీ ప్రక్రియ రెండు దశలుగా విభజించారు. ఆధార్ ఓటీపీ ద్వారా గుర్తింపును నిర్ధారించి కొనుగోలుదారు వివరాలు, సంబంధిత ఆర్టీవో కార్యాలయాన్ని ఎంపిక చేయాలి. దీంతో ఒక అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి కొనుగోలుదారు మొబైల్కు చేరుతుంది.
కొనుగోలుదారులు చేయాల్సింది ఇదీ..
ఆ అప్లికేషన్ నంబర్ ఆధారంగా కొనుగోలుదారు తనవంతు ప్రక్రియను పూర్తి చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్ షిప్ (బయ్యర్) ఎంపిక చేసుకుని ఆధార్ ఓటీపీ ధ్రువీకరణ అనంతరం ప్రస్తుత చిరునామాను నమోదు చేయాలి. వాహనంపై నేర రికార్డులేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఎన్సీఆర్బీ నివేదికను పరిశీలించాలి. అనంతరం ఫీజు చెల్లించి, రసీదు పొందాలి. కొనుగోలుదారు, విక్రేత వరుసగా ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-సైన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇరువురి నుంచి తుది సమర్పణ పూర్తయ్యాక సదరు లావాదేవీ ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుంది. అనంతరం ఆర్టీవో కార్యాలయం నుంచి కొత్త ఆర్సీ జారీ అవుతుంది. కొత్త యజమాని వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

