ఇన్లూయెన్సర్లలో రకాలు
1000 నుంచి 10 వేలు న్యానో ఇన్ఫులియన్సర్స్
10 వేల నుంచి ఒక లక్షమైక్రో ఇన్ఫులియన్సర్స్
లక్ష నుంచి 10 లక్షలు మ్యాక్రో ఇన్ఫులియన్సర్స్
10 లక్షలకుపైగా మెగా లేదా సెలబ్రెటి ఇన్ఫులియన్సర్స్
అనూరాధ గృహిణి.. ప్రతి ఆదివారం ఒక జోకు,కొత్త వంటకాలు, నృత్యానికి సంబంధించిన పోస్టు.. కొత్తగా ఉండేవిధంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పోస్టు చేస్తుంది. ఆమెకు 2వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్‌తో అప్పుడప్పుడు తన స్నేహితురాలి చీరల వ్యాపారానికి సంబంధించి ప్రకటనలు ఇస్తుంది. ఈ ప్రకటనతో వారానికి ఆమె రూ. 5వేల వరకు సంపాదిస్తుంది. తన సోషల్‌మీడియా అకౌంట్లో ప్రకటన పెట్టడంతో అందులో ఉన్న 2 వేలమంది వాటి గూర్చి చర్చించుకుంటారు. ఇక్కడ చీరల వ్యాపారికి మార్కెటింగ్ ఖర్చు తక్కువే ఉంటుంది… కేవలం ఈ ఒక్క ప్రకటనతో కనీసం 10 మంది కస్టమర్లు, వారి ద్వారా మరికొందరు సదరు వ్యాపారికి వస్తున్నారు. ఇలా గృహిణి ఇంట్లో ఉండే అదనంగా సంపాదిస్తుంది. ఇదే ఇన్లూయెన్సర్ మార్కెటింగ్.
సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : నేడు ప్రతి వ్యాపారి తమ సంస్థ, దుకాణం పేరు ఆన్లైన్లో తప్పనిరిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఆన్లైన్లో అడుగుపెట్టే ప్రతి వ్యాపారి తమ కస్టమర్లను ఏదో విధంగా పెంచుకోవాలని నిరంతర ప్రయత్నం చేస్తుంటారు. సదరు వ్యాపారాలకు సంబంధించిన వస్తువులను, సేవలను విస్తరించడం, వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది తక్కువ ఖర్చుతో ఇన్లూయెన్సర్ మార్కెట్‌పై ఆధారపడుతున్నారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ల వద్దకు ఇన్లూయెన్సర్ ్స మార్కెట్ చేయాలంటూ వ్యాపారులు వెళ్తున్నారు. దీనిని అనుకూలంగా చేసుకొని సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే వారు ఇన్లూయెన్సర్ మార్కెటింగ్‌లోకి అడుగుపెడుతున్నారు. తక్కువ స్థాయిలో వెయ్యి, రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నా ఇన్లూయెన్సర్ మార్కెటింగ్ చేసేందుకు అవకాశముంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వెయ్యి నుంచి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వారు మన దేశంలో సుమారు 76334 మంది ఉన్నట్లు ఇంటర్నెట్ లెక్కలు చెబుతున్నాయి.
ఇన్లూయెన్సర్ ఎలా చేయాలి..
ఇన్ఫులియన్స్ చేస్తాం.. మాకు ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు పలు వెబ్సైట్లు ఇంటర్నెట్లో కొనసాగుతున్నాయి. తమ ప్రొడెక్ట్‌లను ఇన్ఫులియన్స్ చేయించుకోవాలి అని కోరుకునే వ్యాపారులు కూడా ఆయా వెబ్సైట్లలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా నేరుగా కూడా సదరు అకౌంట్దారుని సంప్రదిస్తారు. ఖాతా నిర్వాహకులు తమ కాంటాక్టు నెంబర్లను అందుబాటులో ఉంచుతారు. ఆయా వెబ్సైట్లు ఇన్ఫులియెన్సర్, వ్యాపారులకు మధ్యవర్తిత్వం వహిస్తారు. ప్రకటన ఇచ్చేవారు ఫాలోవర్స్‌తో పాటు తరుచుగా యాక్టివ్‌గా ఉండేవారినే ఎక్కువగా సంప్రదిస్తారు.
ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు
ఇంటర్నెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి. సోషల్‌మీడియాలో పలువురిని ఆకర్షించే విధంగా తమ నైపుణ్యానికి సంబంధించిన పోస్టులు పెట్టి తమ పేజీ, తమ పోస్టులను వీక్షించే వారి సంఖ్య పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఖాళీగా ఇంటర్నెట్తో సమయం వృథా చేయడం కంటే.. కొంత సంపాదించే మార్గాన్ని ఆలోచించడం మంచిది.