E-Shram portal | నేడు ఈ-శ్రామ్ పోర్టల్ ఆవిష్కరణ
E-Shram portal | నేడు ఈ-శ్రామ్ పోర్టల్ ఆవిష్కరణ | కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ-శ్రామ్ పోర్టల్‌ను ఆవిష్కరించనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనుంది. సంబంధిత సమస్యలను ‘14434’ జాతీయ టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోర్టల్‌కు సంబంధించిన లోగోను కేంద్ర కార్మిక,

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ-శ్రామ్ పోర్టల్‌ను ఆవిష్కరించనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనుంది. సంబంధిత సమస్యలను ‘14434’ జాతీయ టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోర్టల్‌కు సంబంధించిన లోగోను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ నెల 24న ఆవిష్కరించారు. దేశాన్ని నిజంగా నిర్మించే శ్రామికులు అసంఘటిత రంగానికి చెందిన వారేనని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నేషన్ బిల్డర్స్ అయిన అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయబోతున్నామని, పోర్టల్ ఆధారంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేసేందుకుగాను కేంద్రప్రభుత్వం కృషి చేయనుందని కేంద్రం మంత్రి తెలిపారు. నిర్మాణ, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు సహా 38కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
పోర్టల్‌లో కార్మికులు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతాను వినియోగించి శ్రామ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, స్వస్థలం, సామాజిక వర్గం వంటి ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వాలి ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఆధార్ నెంబర్ మాదిరిగా 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనుంది. ఈ పన్నెండు సంఖ్యల యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ద్వారా వారికి ఒక ఐడెంటిఫికేషన్ రానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

