IPL 2023 : చిన్నస్వామి స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. భారీ స్కోర్లు నమోదైన పోరులో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాఓ గెలిచింది. మూడో విజయం నమోదు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగడంతో చెన్నై 226 రన్స్ చేసింది. ఆ తర్వాత డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(76) దంచికొట్టారు. అయితే.. ఆర్సీబీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి పాలైంది.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్(0) ఔటయ్యాడు. 15 రన్స్‌కే రెండు వికెట్లు పడిన ఆర్సీబీని కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(76) ఆదుకున్నారు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేసిన వీళ్లు అర్ధ శతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 136 రన్స్ జోడించారు. వీళ్లిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. దినేశ్ కార్తిక్(28) చివరిదాకా నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన షహబాజ్() పార్నెల్(2) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మోయిన్ అలీ ఒక వికెట్ తీశారు.
Action replay of the previous dismissal!
And once again it’s @msdhoni with the catch 😎
An excellent knock comes to an end for Faf du Plessis as #RCB need 58 off the final five!
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/vYyULZyLt7
— IndianPremierLeague (@IPL) April 17, 2023
టాస్ ఓడిపోయిన చెన్నైకి మూడో ఓవర్లోనే షాక్.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే(83), అజింక్యా రహానే(37) ఇన్నింగ్స్ నిర్మించారు. రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(52) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడిన అతను 25 బంతుల్లో 2 పోర్లు ఐదు సిక్స్‌లతో ఫిఫ్టీ కొట్టాడు. అంబటి రాయడు (14) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, విజయ్‌కుమార్ వైశాక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, వేనీ పార్నెల్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు.