నాగార్జున ఇంటర్‌పోల్ అధికారి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ…‘దుబాయ్‌లోని అందమైన లొకేషన్లలో నాగార్జున, ఫైటర్స్ కాంబినేషన్లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. ఈ స్టంట్స్ చిత్రీకరణకు అధునాతన సాంకేతికత ఉపయోగించాం. వీటితో పాటు రొమాంటిక్ పాట రూపకల్పన జరిగింది. ఈ షెడ్యూల్లో తెరకెక్కించిన విజువల్స్ సినిమాలో ఆకట్టుకునేలా ఉంటాయి’ అన్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ : బ్రహ్మ కడలి, యాక్షన్ : దినేష్ సుబ్బరాయన్, కేచ, సినిమాటోగ్రఫీ : ముఖేష్. జి.