ఉరి సెక్టార్లో రూ.25కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Drugs worth Rs 25 crore recovered along LOC in north Kashmir’s Uri sector | ఉత్తర కశ్మీర్ బారాముల్ల జిల్లాలోని ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట రూ.25కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు

శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్ బారాముల్ల జిల్లాలోని ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట రూ.25కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఎస్ఎస్పీ రాయీస్ అహ్మద్ భట్ మాట్లాడుతూ బారాముల్ల సరిహద్దు సమీపంలో శనివారం అనుమానాస్పద కదలికలను గమనించి.. దళాలను అప్రమత్తం చేయగా.. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల నుంచి అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేసేందుకు చేసిన ప్రయత్నాలను జవాన్లు విఫలం చేశారన్నారు. సుమారు 25 నుంచి 30 కిలోల హెరాయిన్‌ను బలగాలు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.25కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో డ్రగ్స్ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సౌంజనా గ్రామం సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి డ్రోన్ సహాయం జారవిడిచిన ఆయుధాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

