శాలరీ అకౌంట్స్ ఎన్ని రకాలున్నాయో తెలుసా..?

హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ సంస్థలు లేదా కంపెనీలకు ప్రత్యేక శాలరీ అకౌంట్ ప్యాకేజీని అందిస్తున్నది. ఎస్బీఐ శాలరీ అకౌంట్లో ఎనిమిది రకాలు ఉన్నాయి.అవేంటంటే..?
హాస్పిటల్స్, హోటల్స్, ట్రాన్సుపోర్ట్ కంపెనీలు సహా వివిధ సేవా సంస్థల్లోని కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్పీ) ప్రయోజనకరం. నికర నెల వేతనం ఆధారంగా రూ.లక్షకు పైగా వేతనం ఉంటే ప్లాటినమ్, రూ.50,వేల నుంచి రూ.లక్ష ఉంటే డైమండ్, రూ.25వేల నుంచి రూ.50వేల వరకు ఉంటే గోల్డ్, రూ.10వేల నుంచి రూ.25,000 వరకు వేతనం ఉంటే సిల్వర్. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, నాబార్డు ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (సిజిఎస్పీ) ఇది. నెట్ మంత్లీ శాలరీ రూ.10,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటే సిల్వర్, రూ.25,000 నుంచి రూ.50,000 ఉంటే గోల్డ్, రూ.50,000 నుంచి రూ.1,00,000 ఉంటే డైమండ్, రూ.లక్షకు పైన ఉంటే ప్లాటినమ్.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఉద్యోగులతో పాటు రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్పోరేషన్లు బోర్డ్స్ ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ(SGSP). సిల్వర్: రూ.10,000/- నుంచి రూ.25,000, గోల్డ్: రూ.25,000 నుంచి రూ.50,000/- వరకు, డైమండ్: రూ.50,000 నుంచి రూ.1,00,000/- వరకు, ప్లాటినమ్: రూ.1,00,000/- కు పైన.ఇండియన్ రైల్వే ఉద్యోగులు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వే కార్పోరేషన్, ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో ఉద్యోగులకు రైల్వే శాలరీ ప్యాకేజీ(ఆరెస్పీ) అందుబాటులో ఉంటుంది. ఉద్యోగి వేతనం ఆధారంగా సిల్వర్: రూ.10,000/- నుంచి రూ.25,000/- వరకు, గోల్డ్: రూ.25,000 నుంచి రూ.50,000/- వరకు, డైమండ్: రూ.50,000 నుంచి రూ.1,00,000/- వరకు, ప్లాటినమ్ రూ.1,00,000/-కు పైన.

డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (డిఎస్పీ) కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్, జీఆర్ఈఎఫ్ వస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్, ఆర్ఆర్, జీఆర్ఈఎఫ్లలో పని చేసే వారి ర్యాంకును బట్టి గోల్డ్, డైమండ్, ప్లాటినం ఉన్నాయి. ఆఫీసర్లలోను డైమండ్ లేదా ప్లాటినమ్ వేరియంట్స్ ఉన్నాయి. సెంటర్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు ఈ అకౌంట్ ప్యాకేజీ ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఓపెన్ చేయవచ్చు లేదా సీఏపీఎస్పీ అకౌంట్ కిందకు మార్చుకోవచ్చు. ఇన్సురెన్స్, ఓవర్ డ్రాఫ్ట్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ మినహా అన్ని ప్రయోజనాలు ఉంటాయి.
అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సివిల్ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్, రిజర్వ్ పోలీస్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, (పార్ట్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫోర్స్) కోసం పోలీస్ శాలరీ ప్యాకేజీ. సిల్వర్: నెట్ మంత్లీ శాలరీ రూ.10,000 నుండి రూ.25,000 వరకు, గోల్డ్: నెట్ మంత్లీ శాలరీ రూ.25,001 నుండి రూ.50,000 వరకు, డైమండ్: నెట్ మంత్లీ శాలరీ రూ.50,001 నుండి రూ.1,00,000 వరకు, అలాగే ఎస్పీ అండ్ హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్‌కు కూడా డైమండ్ వర్తిస్తుంది. ప్లాటినమ్: నెట్ మంత్లీ శాలరీ రూ.1,00,000. అలాగే రూ. డీఐజీ, హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్. ఇండియన్ కోస్డ్ గార్డ్ ఉద్యోగులకు ఇండియన్ కోస్డ్ గార్డ్ శాలరీ ప్యాకేజీ ఉద్యోగుల వారీగా చూస్తే గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఓపెన్ చేయవచ్చు. అలాగే అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- account
- banks
- National news
- salary
RELATED ARTICLES
తాజా వార్తలు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

