హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్‌గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.