సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా జనవరి 1 నుంచి 9 వరకు జరుగనున్న టీమ్ ఈవెంట్ ఏటీపీ టోర్నీకి జొకోవిచ్ దూరమయ్యాడు. టోర్నీ నుంచి జొకోవిచ్ వైదొలిగాడని బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో పాల్గొనకపోవడానికి కారణాలు మాత్రం సెర్బియా స్టార్ జొకో వెల్లడించలేదు. అతడి స్థానంలో దుసన్ లజోవిక్ బరిలోకి దిగుతున్నాడు. ఐదో ర్యాంకర్ ఆండ్రే రుబ్లెవ్ (రష్యా) కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. తన కొవిడ్ వ్యాక్సినేషన్‌పై నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జొకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది.