దేవుడి దీపం తెచ్చిన పెను ప్రమాదం
భక్తితో వెలిగించిన దేవుడి దీపం ఒక అపార్ట్మెంట్లో పెను బీభత్సవాన్ని సృష్టించింది. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నయాన్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
- ఫ్లాట్‌లో దీపం వెలిగించగా..
- పక్కకు ఒరిగి అంటుకున్న మంటలు
- మరో ఫ్లాట్‌కు వ్యాపించిన వైనం..
- రూ.25 లక్షల ఆస్తినష్టం
కుత్బుల్లాపూర్, నవంబర్ 14 : భక్తితో వెలిగించిన దేవుడి దీపం ఒక అపార్ట్మెంట్లో పెను బీభత్సవాన్ని సృష్టించింది. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నయాన్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల నార్త్ఎన్సీఎల్ ప్రాంతంలో ఉన్న నయాన్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులో ఫ్లాట్ నంబర్ 404లో వేణుగోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. రోజువారి పూజలో భాగంగా ఇంట్లో దేవుడి వద్ద దీపం వెలిగించి పనుల నిమిత్తం డోర్ లాక్ చేసి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఆ దీపం ఒరిగి పక్కనే ఉన్న వస్ర్తాలకు, ఇంటీరియల్ వుడ్వర్క్స్కు అంటుకుంది.
దీనికి తోడు ఎలక్ట్రికల్ వైర్లకు తగలడంతో ఇంట్లో ఉన్న ఏసీ కంప్రెజర్ పేలడంతో పాటు గ్యాస్‌సిలిండర్ లీకేజీగా మారి మంటలు వ్యాప్తిచెందాయి. వెనువెంటనే దానికి ఎదురుగా ఉన్న 405 ప్రసాద్ అనే వ్యక్తి ఫ్లాట్‌లోకి మంటలు వ్యాపించాయి. సమయానికి ఆ ఫ్లాట్‌లో కూడా ఎవరూ లేకపోవడంతో రెండు ఫ్లాట్లలో మంటలు వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగ అపార్ట్మెంట్ మొత్తాన్ని కమ్మేశాయి. నివాసితులంతా ప్రాణ భయంతో మెట్లు దిగి కిందకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపుగా రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని, ఎలాంటి ప్రాణపాయం లేకుండా బయటపడ్డారని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

