Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Director Venu Udugula | ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మరియు వివాదంపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల తీవ్రంగా స్పందించారు.
Director Venu Udugula | ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మరియు వివాదంపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకుండా దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకాలని వేణు ఉడుగుల హితవు పలికారు. తెలంగాణను కించపరచడం సులువు అని, కానీ దానిని అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం అవసరమని ఆయన పేర్కొన్నారు. మన జీవితాలను, సంస్కృతులను నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చే ‘ఇడుపు కాయితం’ లాంటి సినిమాలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి కానీ, ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని అజ్ఞానంతో నిర్వచించవద్దని ట్రోలర్స్‌కు గట్టిగా బదులిచ్చారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇడుపు’ లేదా ‘ఇడుసు’ అంటే విడిచిపెట్టడం అనే అర్థం వస్తుంది. భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయేటప్పుడు పెద్దమనుషుల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్ని తెలంగాణలో ‘ఇడుపు కాయితం’ అని పిలుస్తారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ పదంపై సోషల్ మీడియాలో కొందరు అవగాహన లేక రకరకాలుగా ట్రోల్ చేయడం, సెటైర్లు వేయడం జరిగింది. తాజాగా ఇందులో నుంచి గడప అనే సెకండ్ సింగిల్ కూడా విడుదల చేశారు. ఈ పాటపై కూడా ఇలాగే ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వేణు ఉడుగుల స్పందించి ప్రాంతీయ సంస్కృతులను, మాండలికాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. జి.ఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

