యువన్, రిధాన్కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’. డాక్టర్ ప్రగభల్ దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా నిర్మాత దిల్‌రాజు తెలుగులో విడుదలచేస్తున్నారు. డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ ఇది.
రెండు జట్ల మధ్య మొదలైన పోటీ ఏ విధంగా పగ, ప్రతీకారాలకు దారితీసిందనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్పోర్ట్ డ్రామా అడ్వెంచరస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ సినిమా కోసం ఆఫ్ రోడ్ రేసింగ్‌లో నటీనటులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చాం. డూప్‌లు లేకుండా తెరకెక్కించిన మడ్రేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ నెల 30న ట్రైలర్‌ను విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ: రతీష్.