న్యూఢిల్లీ, మార్చి 24: ఎంజీ మోటర్ ఇండియా.. ఎంజీ ఈపే పేరుతో ఓ డిజిటల్ కార్ ఫైనాన్స్ వేదికను గురువారం ప్రారంభించింది. తమ కార్ల కొనుగోలుదారులకు సులువుగా బ్యాంకుల నుంచి వాహన రుణాలు వచ్చేలా ఈ ఎంజీ ‘ఈపే’ను ఎంజీ మోటర్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా ప్రైం, యాక్సిస్ బ్యాంక్‌లతో ఎంజీ మోటర్ భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఆన్లైన్ వేదికగా కార్ల కొనుగోలుకు ఎంజీ ఈపే.. కస్టమర్లకు ఎంతగానో దోహదపడగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఎంజీ మోటర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా వ్యక్తం చేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సర్వీసును అందుబాటులోకి తెస్తామన్న ఆయన కస్టమర్లు దీనిద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు, ఫైనాన్స్ ఎంపిక, మార్జిన్ మనీ చెల్లింపు వంటివి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చన్నారు. వాహన బీమా కూడా సులభంగానే పొందవచ్చని తెలిపారు.