శివ ఆలపాటి, ప్రియాంక శర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డై హార్ ఫ్యాన్’. అభిరామ్.ఎమ్ దర్శకుడు. చంద్రప్రియ సుబుది నిర్మాత. ఇటీవల చిత్రబృందం చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక సెలబ్రిటీకి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్, కామెడీ డ్రామా ఈ సినిమా కథ. డైహార్డ్ ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటించారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు పొన్నాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ కింతలి, మాటలు: సయ్యద్ తేజుద్దీన్.