డయేరియాతో బాధపడుతున్న పిల్లలకు ఓఆర్ఎస్ కాకుండా ఇంకా ఏవి తాగిస్తే మంచిది?
Diarrhoea | అతిసార వ్యాధి వల్ల విరేచన రూపంలో శరీరం కోల్పోయే నీరు, ఖనిజ లవణాలు, బైకార్బొనేట్ తిరిగి సమకూర్చడమే వైద్యం ముఖ్య ఉద్దేశం. వ్యాధి ప్రారంభం కాగానే ఇంట్లో లభించే ద్రవ పదార్థాలతోనే చికిత్స ప్రారంభించవచ్చు. బిడ్డలో బలహీనత చిహ్నాలు కనిపించనంత వరకూ ఇవే సరిపోతాయి.
ఇవి రెండు రకాలు:
1. ఆహార సంబంధమైనవి: అన్నం వార్చిన గంజి, పప్పు నీరు, ఉప్పు వేసిన చల్ల, లస్సీ, గోధుమ పాయసం, బియ్యపు పాయసం, బార్లీ గంజి, సగ్గు బియ్యం జావ, ఆరో రూట్ పొడితో చేసిన గంజి.
2. పండ్ల రసాలు: కొబ్బరి నీరు, టమాట, క్యారెట్ సూప్, నిమ్మ, నారింజ, బత్తాయి రసం, అరటిపండు, సపోట. వీటిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి.
వీటితోపాటు పాలు లేని పల్చటి టీ డికాక్షన్ ఇవ్వవచ్చు. ఈ పదార్థాలను ఓఆర్ఎస్ ఇస్తున్నప్పుడు కూడా ఇవ్వవచ్చు. అయితే, శీతల పానీయాలు ఇవ్వకూడదు. బండ్ల మీద అమ్మే ఏ పండ్ల రసమూ మంచిది కాదు. గులాబ్ జామూన్ ఇస్తే విరేచనాలు తగ్గవు. ఇది ఒక దురభిప్రాయం మాత్రమే.
అత్యుత్తమ మార్గం
విరేచనం ద్వారా శరీరం కోల్పోయే ప్రధాన పదార్థాలను తిరిగి సమకూర్చడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గ్లూకోజ్, లవణ మిశ్రమం.. ఓఆర్ఎస్. దీనిని కనిపెట్టి దాదాపు 50 సంవత్సరాలైంది. ఇప్పటివరకు ఓఆర్ఎస్ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఓఆర్ఎస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి కనీసం 20 లక్షల మంది పిల్లలు మృత్యుముఖం నుంచి రక్షణ పొందుతున్నారు. అతిసార వ్యాధి ఉన్న 90 శాతం పిల్లలకు ఓఆర్ఎస్ సరిపోతుంది. మిగతా 10 శాతం పిల్లలకు దీనితోపాటు వైద్యం అవసరం అవుతుంది. అతిసార వ్యాధికి కారణం ఏదైనా.. శరీరం కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వడానికి ఇదే అత్యుత్తమ మార్గం.
తగిన చర్యలు
ఓఆర్ఎస్ తయారీకి నీటిని తప్పనిసరిగా మరిగించాల్సిన పన్లేదు. కలిపే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. పొడిని కొద్దికొద్దిగా కాకుండా మొత్తం ప్యాకెట్‌ను సూచించిన నీటిలో ఒకేసారి కలపాలి. దీనివల్ల ఒకసారి చిక్కగా, ఒకసారి పలచగా కాకుండా.. సరైన సాంద్రత కలిగిన ద్రవం తయారవుతుంది. పొడిని కలపడానికి పరిశుభ్రమైన మూతలున్న పాత్రలే ఉపయోగించాలి. ఒకసారి తయారుచేసిన ద్రవాన్ని 24 గంటల వరకు మాత్రమే ఉపయోగించి మిగిలిన దాన్ని తీసేయాలి. పెద్ద పిల్లలకు గ్లాసు లేదా కప్పుతో కోరినంత ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు 2-3 నిమిషాలకొకసారి చెంచా చొప్పున ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఒకేసారి ఎక్కువగా ఇస్తే కడుపు ఉబ్బి వాంతి కావచ్చు. అలాంటప్పుడు 10 నిమిషాలు ఆగి మళ్లీ ఇవ్వాలి. వాంతులు ఎక్కువగా ఉంటే కొద్దిగా చల్లని నీరు ఇవ్వవచ్చు. మరిన్ని వివరాలు వచ్చేవారం తెలుసుకుందాం.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
Read More :
మీ పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!!”
“మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”
మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? ఆ అలవాటు ఇలా మాన్పించండి”
“పిల్లల్లో వచ్చే ఈ అనారోగ్య సమస్యతో జాగ్రత్త !!”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

