హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. సోమవారం ముగ్గురు పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు, కానిస్టేబుల్ కే వెంకటరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చి చెక్కులు అందజేశారు.